అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం

ABN , First Publish Date - 2022-12-07T00:02:45+05:30 IST

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పిలుపునిచ్చారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం
అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా

కడప (ఎడ్యుకేషన), డిసెంబరు 6 : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పిలుపునిచ్చారు. కడప నగరం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు చైతన్య అధ్యక్షతన అంబేడ్కర్‌ 66వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మేయర్‌ సురే్‌షబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచనలో ప్రధాన భూమిక పోషించి నూతన సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రతిభాశాలి అంబేడ్కర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్‌ నాయకులు అప్జల్‌ఖాన, వివిధ కార్పొరేషన్ల చైర్మనలు పులి సునీల్‌కుమార్‌, కరీముల్లా, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ పల్లెకొండు సంపతతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:02:49+05:30 IST