-
-
Home » Andhra Pradesh » Kadapa » Trains should be stopped immediately at Kondapuram-MRGS-AndhraPradesh
-
కొండాపురంలో వెంటనే రైళ్లను ఆపాలి
ABN , First Publish Date - 2022-09-09T04:42:23+05:30 IST
కొండాపురం రైల్వేస్టేషన్‌లో వెంటనే రైళ్లను నిలుపుదల చేయాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి డివిజనల్ రైల్వే కౌన్సిల్ మెంబర్ షామీర్‌బాషను కోరారు.

రైల్వే డివిజనల్ కౌన్సిల్ మెంబర్‌కు వినతి పత్రం అందజేత
కొండాపురం, సెప్టెంబరు 8: కొండాపురం రైల్వేస్టేషన్‌లో వెంటనే రైళ్లను నిలుపుదల చేయాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి డివిజనల్ రైల్వే కౌన్సిల్ మెంబర్ షామీర్‌బాషను కోరారు. కొండాపురం రైల్వేస్టేషన్‌లో గురువారం ఆయనతో పాటు సీపీఐ నాయకులు కౌన్సిల్ మెంబర్‌కు విజ్ఞప్తి చేశారు. బ్రిటీష్ కాలంలో కొండాపురం వైపు వెళ్లే 80శాతం రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ ఉండేదన్నారు. పక్కనే ఉన్న సింహాద్రిపురం, యల్లనూరు, లింగాల, తొండూరు తదితర మండలాల ప్రజలకు కొండాపురం రైల్వేస్టేషన్ ఎంతో అనువుగా ఉండేదన్నారు. కరోనా కారణంగా రైౖళ్లస్టాపింగ్ ఎత్తివేయడం దారుణమన్నారు. జిల్లాలో కొన్ని రైల్వేస్టేషన్‌లలో రైళ్లను పునరుద్ధరించినప్పటికీ కొండాపురంలో ఇంత వరకు స్టాపింగ్‌ను పునరుద్ధరించకపోవడం ఏమిటని ఆయనను ప్రశ్నించారు. ఈ నెల 12వ తేదీ సోమవారం నుంచి 75 గంటల పాటు రైల్వేస్టేషన్‌లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు నరసింహారెడ్డి, గండ్లూరు నాగేశ్వరరెడ్డి, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రామకృష్ణ, రామసుబ్బారెడ్డి, అరుణ్, గిరీష్, సబ్బుల రమణ తదితరులు పాల్గొన్నారు.