20న గండి మీదుగా ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-08-18T04:53:26+05:30 IST

శ్రావణ శనివారం సందర్భంగా గండి మీదుగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సీఐ గోవిందరెడ్డి తెలిపారు.

20న గండి మీదుగా ట్రాఫిక్‌ ఆంక్షలు

చక్రాయపేట, ఆగస్టు 17: శ్రావణ శనివారం సందర్భంగా గండి మీదుగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సీఐ గోవిందరెడ్డి తెలిపారు. 20వ తేదీ గండి క్షేత్రంలో జరిగే శ్రావణ మాసోత్సవా ల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. రద్దీ దృష్ట్యా ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వర కు రాయచోటి, కదిరి వైపు నుంచి వేంపల్లె వైపునకు వచ్చే వాహనదారులకు అద్దా లమర్రి క్రాస్‌ రోడ్డు వరకు, వేంపల్లె నుంచి రాయచోటి, కదిరి వైపు వెళ్లే వాహనాలకు వీరన్నగట్టుపల్లె క్రాస్‌ రోడ్డు వరకు మాత్రమే అనుమతిస్తార న్నారు. కావున సదరు ప్రాంతాల నుం చి వచ్చే వాహనదారులు ట్రాఫిక్‌ నిబం ధనలు పాటించాలని భక్తులకు ఎలాం టి అసౌకర్యం లేకుండా చూడాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

Read more