పొగాకుతో ఆరోగ్యానికి చేటు

ABN , First Publish Date - 2022-06-01T05:26:06+05:30 IST

పొగాకు వినియోగం ఆరోగ్యానికి చే టు చేస్తుందని రేగళ్లు వైద్యాధికారి కార్తీక్‌కుమా ర్‌ అన్నారు. పీలేరులో మంగ ళవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవా న్ని నిర్వహించారు.

పొగాకుతో ఆరోగ్యానికి చేటు

పీలేరు, మే 31: పొగాకు వినియోగం ఆరోగ్యానికి చే టు చేస్తుందని రేగళ్లు వైద్యాధికారి కార్తీక్‌కుమా ర్‌ అన్నారు. పీలేరులో మంగ ళవారం  ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవా న్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ర్యాలీ నిర్వహించి పంచాయతీ కార్మికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైద్యులు పుష్ప, శైలజ, పంచాయ తీ ఈవో రెడ్డిప్రసాద్‌, సీహెచ్‌వో జయలక్ష్మీ, హెచ్‌ఈలు ఉషా రాణి, కొండయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, సూపర్‌ వైజర్లు మోహన్‌, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. 

కలకడలో:పొగాకు ఉత్పత్తులు వాడకం వలన ప్రజలు ప్రాణాంతకర వ్యాధుల బారీనపడే అవకాశముందని ఎర్రకోట పల్లె ఆసుపత్రి డాక్టర్లు కిశోర్‌కుమార్‌రెడ్డి, విజయలక్ష్మిలు పేర్కొ న్నారు. మంగళవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీని పాపిరెడ్డిగారిపల్లెలో నిర్వహించారు.  కార్యక్రమంలో  జయరామయ్య, సుబ్బరత్నమ్మ, సరస్వతమ్మ, ముజీబ్‌బాష, భారతమ్మ, షరీప్‌బాష, దేవకుమారి, వరలక్ష్మిలు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: ధూమపానం మనిషి ఆరోగ్యాన్నే కాకుండా జీవితాన్నికూడా కాల్చేస్తుందని వాల్మీకిపురం మండల చిం తపర్తి పీహెచ్‌సీ వైద్యాఽధికారిణి మానస పేర్కొన్నారు. మంగళ వారం ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గ్రామంలో వైద్యాఽధికారులు, సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షుడు ప్రభుచరణ్‌, డాక్టర్‌ శ్రీవిద్య, సూపర్‌వైజర్‌ సుధాకర్‌, సిబ్బంది కరుణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

కురబలకోటలో: పొగాకు బానిసలైతే జీవితం నాశనమవు తుందని విభాగాధపతి లక్ష్మణరావు జగదీష్‌ పేర్కొన్నారు. మం గళవారం మండలంలోని అంగళ్లు సమీపంలోని మిట్స్‌ ఇంజ నీరింగ్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రపంచ ధూమ పాన వ్యతిరేక దినోత్సవం  నిర్వహించారు.  పొగాకును విని యోగించడం వలన ప్రతి నిమిషానికి 10మంది మరణిస్తున్నా రన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు.  కార్యక్రమంలో బాలాజీ, రాజేష్‌ తదితరులు పాలొ,్గన్నారు.

Updated Date - 2022-06-01T05:26:06+05:30 IST