ఆ చెడ్డపేరు తొలగించుకోవాలనే... అసత్య ఆరోపణలు
ABN , First Publish Date - 2022-08-05T04:54:50+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో వైసీపీకి వచ్చిన చెడ్డపేరును తొలగించుకోవాలనే తపనతో వైసీపీ సోషల్ మీడియాలో కంఠమనేని ఉమామహేశ్వరీ ఆత్మహత్యలో చంద్రబాబునాయుడు, లోకే ష్ ప్రమేయం ఉన్నట్లు అసత్యపు ఆరోపణలు చేశారని టీడీ పీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు.
అనైతిక ఆరోపణలు తిప్పికొట్టాలి
కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి
ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 4: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో వైసీపీకి వచ్చిన చెడ్డపేరును తొలగించుకోవాలనే తపనతో వైసీపీ సోషల్ మీడియాలో కంఠమనేని ఉమామహేశ్వరీ ఆత్మహత్యలో చంద్రబాబునాయుడు, లోకే ష్ ప్రమేయం ఉన్నట్లు అసత్యపు ఆరోపణలు చేశారని టీడీ పీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి అనైతిక ఆరోపణలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన తన కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ ఉమామహేశ్వరీ ఆత్మహత్య ఘటనలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా దేవేంద్రారెడ్డి చంద్రబాబు, లోకే్‌షకు సంబంధం ఉన్నట్లు తప్పుడు పోస్టింగులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి నాడు వివేకా హత్యను కూడా రా జకీయం చేశారని, ఈ హత్యలో చంద్రబాబు కుట్ర ఉందని చెప్పి, సీబీఐ విచారణ కోరి, తాను సీఎం అయ్యాక సీబీఐ విచారణ వద్దంటూ హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. సొంత బాబాయ్ హత్య కేసు నీరుగారుస్తున్నారని, దీంతో వైసీపీకి చెడ్డపేరు వచ్చిందన్న భావనతోనే దాని నుం చి బయటపడేందుకు వైసీపీ సోషల్ మీడియాలో ఉమామహేశ్వరీ ఆత్మహత్యను కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ తన అక్రమాస్తుల కేసును వాదిస్తున్న న్యాయవాది నిరంజన్రెడ్డినే వివేకా హ త్య కేసు నిందితుల తరపున వాదించేలా చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. వైసీపీ పతనం మొదలైందని, చంద్రబాబు, లోకే్‌షపై తీవ్ర అసత్యపు అరోపణలు చేస్తున్న వైసీపీకి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. సమావేశంలో టీడీపీ కడప పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి సానా విజయభాస్కర్‌రెడ్డి, కార్యదర్శి సిద్దయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బరాజు, మాజీ కౌన్సిలర్ ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.