దేవుని కడపలో చోరీ

ABN , First Publish Date - 2022-06-07T05:36:28+05:30 IST

కడప నగరం దేవుని కడపలో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి రాజశేఖర్‌ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు కిటికీ గ్రిల్స్‌ కట్‌ చేసి ఇంట్లోకి చొరబడి కబోర్డ్‌, బీరువాలో ఉన్న వెండి వస్తువులు, నగదు అపహరించారు.

దేవుని కడపలో చోరీ

రెండు లక్షల మేర వెండి.. 10 వేలు నగదు అపహరణ


కడప(క్రైం), జూన్‌ 6 : కడప నగరం దేవుని కడపలో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి రాజశేఖర్‌  ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు కిటికీ గ్రిల్స్‌ కట్‌ చేసి ఇంట్లోకి చొరబడి కబోర్డ్‌, బీరువాలో ఉన్న వెండి వస్తువులు, నగదు అపహరించారు. రాజశేఖర్‌ వేంపల్లిలో జరిగే బంధువుల వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 2వ తేదీ వెళ్లారు. తిరిగి సోమవారం సొంతింటికి వచ్చారు. దుమ్ము ఎక్కువగా ఉండడంతో శుభ్రం చేసేందుకు కిటికీ వద్దకు వెళ్లగా అక్కడున్న కిటికీ గ్రిల్స్‌ కట్‌ చేసి పక్కన వేయడంతో ఆయన ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించారు. రూ.2 లక్షల విలువ చేసే వెండి వస్తువులతో పాటు పది వేల నగదు చోరీకి గురైనట్లు చిన్నచౌక్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


 

Read more