సామాన్యుల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-15T05:29:00+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ పాలన ప్రభుత్వం విపరీతం గా ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేశ్‌ ఆరోపించారు.

సామాన్యుల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం
మదనపల్లె బాదుడే బాదుడులో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి

మదనపల్లె టౌన్‌, మే 14: రాష్ట్రంలో వైసీపీ పాలన ప్రభుత్వం విపరీతం గా ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేశ్‌ ఆరోపించారు. శనివారం మండలంలోని ఈశ్వరమ్మకాలని, దండువారిపల్లెలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి మాట్లాడుతూ వ్యవసాయబోర్లకు మీటర్లు బిగించి రైతులకు ఉరితాడు రుచి చూపించనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రాలను ఇంటింటా పంచుతూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో టౌన్‌బ్యాంకు మాజీ చైర్మన్‌ నాదెళ్ల విద్యాసాగర్‌, యశశ్వి, డి.శ్రీనివాసులు, కె.లక్ష్మన్న, మాజీ సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, నవీన్‌, ఎంపీటీసీ దేవేంద్ర, రాణా, చంద్ర, రామాంజనేయులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాలొన్నారు.

బాదుడు ప్రభుత్వానికి నూకలు చెల్లాయి

పెద్దతిప్పసముద్రం, మే 14:  అధిక ధరలతో సామాన్యుల నడ్డి విరుస్తు న్న వైసీపీ ప్రభుత్వానికి ఇక నూకలు చెల్లాయని టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌ చార్జ్‌ శంకర్‌యాదవ్‌ అన్నారు. శనివారం  మండల కేంద్రమైన  పీటీఎం బస్టాండులో బాదుడే బాదుడు కార్యక్రమంలో తంబళ్ళపల్లె టీడీపీ పార్టీ ఇంచార్జ్‌ శంకర్‌యాదవ్‌  పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  రైతు భరోసా పథకం అందించడానికి కూడా కొర్రీలు పెడుతున్నారని అన్నారు.  కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనాథ్‌రెడ్డి, మండల టీడీపీ అద్యక్షుడు ఆనంద్‌రెడ్డి, టీడీపీ మండల యువనాయకుడు మనోజ్‌ జయంత్‌రెడ్డి, మద్దయ్యగారిపల్లె హరి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి తమక శ్రీనివాసులు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శివానంద, పకుృద్దీన్‌, మాజీ ఎంపీటీసీ చిన్నా, మదుకర్‌ యాదవ్‌,తదితరులు పాల్గొన్నారు. 


ప్రజలపై భారాలు మోపడం తగదు

తంబళ్లపల్లె, మే 14: ఒక్క అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపడం తగదని తంబళ్లపల్లె టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ ఆదేశాల మేరకు శనివారం రేణుమాకులపల్లె హరిజనవాడ, కోటకొండ ఎగువ, దిగువ తాండాలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.  మూడేళ్లలో పెరిగిన ధరలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, తెలుగు యువత నాయకులు నరసింహులు, మాజీ సర్పంచ్‌ బేరి శీన, రాధాశెట్టి, రామ్మోహన్‌, శివప్రసాద్‌నాయక్‌, మధునాయక్‌, ప్రసాద్‌, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-15T05:29:00+05:30 IST