దేవాలయ వ్యవస్థ పవిత్రను దెబ్బతీయరాదు

ABN , First Publish Date - 2022-01-13T05:38:04+05:30 IST

హిందూధర్మాలను, దేవాలయ వ్యవస్థ పవిత్రను దెబ్బతీసే ప్రయత్నాలు సమాజానికి మంచిది కాదని విశ్వహిందూ పరిషత్‌, భారతీయ జనతాపార్టీ నేతలు పేర్కొన్నారు. శ్రీశైలంలో ఆలయ దుకాణాలను ఇతర మతస్తులకు కేటాయించే పద్ధతులకు స్వస్తి పలకాలన్నారు.

దేవాలయ వ్యవస్థ పవిత్రను దెబ్బతీయరాదు
ధర్నా చేస్తున్న వీహెచ్‌పీ, బీజేపీ నేతలు

వీహెచ్‌పీ, బీజేపీ నేతలు

కడప (మారుతీనగర్‌), జనవరి 12: హిందూధర్మాలను, దేవాలయ వ్యవస్థ పవిత్రను దెబ్బతీసే ప్రయత్నాలు సమాజానికి మంచిది కాదని విశ్వహిందూ పరిషత్‌, భారతీయ జనతాపార్టీ నేతలు పేర్కొన్నారు. శ్రీశైలంలో ఆలయ దుకాణాలను ఇతర మతస్తులకు కేటాయించే పద్ధతులకు స్వస్తి పలకాలన్నారు. ఇందుకు నిరసనగా బుధవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేతలు బైరెడ్డి రామకృష్ణారెడ్డి, కాకర్ల రాముడు, బీజేపీ నాయకులు పెసల సాంబశివారెడ్డి, హరినారాయణరావు, మొయిళ్లకాల్వ శ్రీనివాసులురెడ్డి, విజయ నరసింహులు మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా హిందూ దేవాలయాల నిర్వహణను పూర్తిగా హిందువులకే అప్పగించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఇదిలావుండగా హిందూదేవాలయాలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకొని చర్చీలు, మసీదుల నిర్వహణ స్వేచ్ఛ ఆ మతాల వారికే వదిలేసిందన్నారు. అలాగే హిందూ దేవాలయాల పాలకమండళ్లలో, దేవదాయ ధర్మదాయ శాఖ ఉద్యోగాలలో అన్యమతస్తులను నియమించడం సరికాదన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బత్తల పవన్‌కుమార్‌, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-13T05:38:04+05:30 IST