రెండో విడత పనులు గ్రౌండింగ్ చేయాలి
ABN , First Publish Date - 2022-08-13T05:18:41+05:30 IST
జిల్లాలో రెండో విడత మనబడి నా డు- నేడు పనులు శరవేగంగా వం ద శాతం గ్రౌండింగ్ జరగాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అన్నారు.

అధికారుల సమీక్షలో కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి(కలెక్టరేట్), ఆగస్టు12: జిల్లాలో రెండో విడత మనబడి నా డు- నేడు పనులు శరవేగంగా వం ద శాతం గ్రౌండింగ్ జరగాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అన్నారు. శుక్రవా రం కలెక్టరేట్ మినీ మీడియో కాన్ఫరెన్స్ హాల్లో మనబడి నాడు- నే డు రెండో దశ పనుల పురోగతిపై విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్ట ర్లు, సమగ్ర శిక్ష అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ రెం డో విడత నాడు- నేడు పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మం జూరైన పాఠశాలకు అడ్మినిస్ర్టేషన్ మంజూ రు, ఎక్స్పెండీచర్ జనరేట్, రివాల్వింగ్ ఫండ్ జనెరేటెడ్, పెండింగ్ సీఎ్‌ఫఎంఎస్, రివాల్వింగ్ ఫండ్, ఎఫ్టీఓ జనరేషన్ పెండింగ్, బిల్స్ అప్లోడ్, ఎక్స్పెండీచర్ రైజెడ్, సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఫర్నీచర్, గ్రీన్ చాక్‌బోర్డ్స్, ఫ్యాన్స్, పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్, రూప్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల కోసం ఇండెంట్ రైజ్ చేయాలన్నారు.
పనుల న్నీ కూడా వెంటనే మొదలు పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో మనబడి నాడు- నేడు రెండో దశలో 1010 స్కూళ్లకు 972 ఎస్టిమేషన్స్ జనరేట్ అయ్యాయని, 38 స్కూళ్ల ఎస్టిమేషన్ జనరేట్ కాలేదన్నారు. అడ్మిన్ మంజూ రు వందశాతం పూర్తి కావాలన్నారు. ఎంఓయూ నాట్సైన్ 20 పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే క్లియర్ చేయాలని సంబంధిత ఇంజనీర్లను కలెక్ట ర్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కల్లా ఎంఓయూ సైన్ అప్రూవల్ ఉండాలన్నా రు. రివాల్వింగ్ ఫండ్ జనరేటెడ్ 823 స్కూల్ అయ్యాయని, ఇంకా 100 స్కూళ్లకు సంబంధించి రివాల్వింగ్ ఫండ్ జనరేట్ కాలేదన్నా రు. చేసిన పనులకు సంబంధించి వెంటనే బిల్స్ అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమం లో డీఈఓ రాఘవరెడ్డి, ఐసీడీఎస్ పీడీ, సమగ్ర శిక్ష ఇంజనీర్లు పాల్గొన్నారు.