ఆశ కార్యకర్తల వేతనం రూ.15 వేలకు పెంచాలి

ABN , First Publish Date - 2022-11-06T22:23:42+05:30 IST

ఆశ కార్యకర్తల వేతనం పెంచుతూ జీవో విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రాధాకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ తెలిపారు. ఆదివారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనా పట్టించుకోకుండా, గర్భిణులు, బాలింతలు, ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు.

ఆశ కార్యకర్తల వేతనం రూ.15 వేలకు పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న సాంబశివ

రైల్వేకోడూరు, నవంబరు 6: ఆశ కార్యకర్తల వేతనం పెంచుతూ జీవో విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రాధాకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ తెలిపారు. ఆదివారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనా పట్టించుకోకుండా, గర్భిణులు, బాలింతలు, ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్కువ వేతనాలతో వారితో గొడ్డు చాకిరీ చేయించుకుంటోందన్నారు. ప్రభుత్వ, మెడికల్‌, మెటర్నిటీ సెలవులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ. 10 వేల వేతనం ఒకే సారి ఇవ్వాలన్నారు. ఏఐటీయూసీ రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి యం. గంగాధర్‌, జిల్లా ఉపాధ్యక్షురాలు సరోజమ్మ, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాళ్లు కుమారి, భాగ్యలక్ష్మి, గీత, ప్రసన్న, వెంకటసుబ్బమ్మ, దేవి, స్వప్న, పావని, ఏఐటీయూసీ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట టౌన్‌ : ఆశవర్కర్ల జీతం 15వేలకు పెంచుతూ జీవో విడుదల చేయడంతోపాటు, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి జీవో నెం.21ని రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు. రాజంపేట ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ పట్టణ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.ఎస్‌.రాయుడు, సరోజమ్మ, మురళీ, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-06T22:23:46+05:30 IST