రోడ్లపైని గుంతలు పూడ్చాలి

ABN , First Publish Date - 2022-10-18T04:46:35+05:30 IST

కొర్రపాడురోడ్డులోని ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహం వద్ద ప్రధాన రోడ్డుపైనున్న గుంతలను వెంటనే పూడ్చాలని సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌, ఏఐసీసీటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.

రోడ్లపైని గుంతలు పూడ్చాలి
గుంతలో నిల్చుని నిరసన తెలియజేస్తున్న సీపీఐ, ఏఐసీసీటీయూ నాయకులు

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 17 : కొర్రపాడురోడ్డులోని ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహం వద్ద ప్రధాన రోడ్డుపైనున్న గుంతలను వెంటనే పూడ్చాలని సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌, ఏఐసీసీటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.  సోమవారం వారు రోడ్డుపైనున్న గుంతల్లో నిల్చుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్‌ కార్యదర్శి జాఫర్‌, ఏఐసీసీటీయూ కార్యదర్శి రెహమాన్‌ మాట్లాడుతూ ఈ రోడ్డుపై లోతైన పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వర్షపునీరు చేరడంతో గుంతలు కన్పించక ద్విచక్రవాహన చోదకులు ప్రమాదాలపాలవుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వావిజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ యూనియన్ల నాయకులు జమీర్‌, అల్లాబకష్‌, చోటు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-18T04:46:35+05:30 IST