పాడి పశువుల కొనుగోలే లక్ష్యం
ABN , First Publish Date - 2022-08-05T04:52:08+05:30 IST
పాడి పశువుల కొనుగోలే లక్ష్యమని వైఎస్సార్ క్రాంతి పథకం ఏపీఎం ఆంజనేయులు అన్నారు.
లింగాల, ఆగస్టు 4: పాడి పశువుల కొనుగోలే లక్ష్యమని వైఎస్సార్ క్రాంతి పథకం ఏపీఎం ఆంజనేయులు అన్నారు. గురువారం లింగాలలోని కార్యాలయంలో సీసీలతో ఆయన మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ కార్యక్రమం అమలులో భాగంగా పాడి పశువుల కొనుగోలుకు రుణాలు మంజూరుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జగనన్న పాలవెల్లువ కమాండ్ కంట్రోల్ టీం సభ్యులు సీసీ కోన హరికృష్ణ కమ్యూనిటటీ కోఆర్డినేటర్ సూర్యనారాయణ, జయపాల్, ఉత్తయ్య పాల్గొన్నారు.