ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు దారుణం

ABN , First Publish Date - 2022-09-22T05:03:09+05:30 IST

విజయవాడలోని హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగిస్తే సీఎం జగన్‌రెడ్డి ప్రజల్లో చరిత్రహీనుడుగా నిలిచిపోతారని, పేరు మార్పు దారుణమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు దారుణం
జమ్మలమడుగులో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఇన్‌ఛార్జి భూపే్‌షరెడ్డి, టీడీపీ నాయకులు

తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగ్రహం

ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 21 : విజయవాడలోని హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగిస్తే సీఎం జగన్‌రెడ్డి ప్రజల్లో చరిత్రహీనుడుగా నిలిచిపోతారని, పేరు మార్పు దారుణమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇలా ఉంటే, హెల్త్‌ యూనివర్సిటీకి జీవం పోసిన ఎన్టీఆర్‌ను గౌరవిస్తూ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 1998లో హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టారన్నారు. అయితే ప్రస్తుత సీఎం జగన్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్లు నిధులు దారి మళ్లించి దుర్వినియోగం చేశారన్నారు. జిల్లాకు వైఎ్‌సఆర్‌ పేరును కలుపగా, టీడీపీ ప్రభుత్వం ఆ పేరును తొలగించలేదన్నారు. అయితే సీఎం జగన్‌రెడ్డి వైఎ్‌సఆర్‌ కడపజిల్లాలో కడప పేరును తొలగించి జిల్లా చరిత్రను కనుమరుగు చేశారన్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించి, తన తండ్రి వైఎ్‌సఆర్‌ పేరు పెట్టడం ఎంత వరకు సబబు అన్నారు.  హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని, లేదంటే జగన్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

ఎన్టీఆర్‌ పేరు తొలగింపు పిచ్చితుగ్లక్‌ చర్య..: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం పిచ్చి తుగ్లక్‌ చర్యగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు అభివర్ణించారు. బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.   ఎన్టీఆర్‌ పేరు యఽథావిధిగా కొనసాగించాలని, లేకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.

జమ్మలమడుగు రూరల్‌..: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి  వెంటనే వెనక్కు తీసుకోవాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం జమ్మలమడుగులోని టీడీపీ కార్యాలయం ఎదుట  ఎన్టీరామారావు చిత్రపటానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్యదర్శి ఖదీర్‌, రాయల్‌కిరణ్‌, ఎస్టీ కార్యదర్శి జయచంద్ర, జిల్లా నాయకులు సయ్యద్‌ రఫి, దాదాపీర్‌, మహబూబ్‌బాష, జిలాన్‌, ము న్నా, షబ్బీర్‌, రాజా, శ్రీనివాసులు, దస్తగిరి, ఖలందర్‌, మాబాష పాల్గొన్నారు.

Updated Date - 2022-09-22T05:03:09+05:30 IST