వరలక్ష్మి వ్రత వేడుకల సందడి

ABN , First Publish Date - 2022-08-05T05:24:31+05:30 IST

శ్రావణ మాసం పూజలు, వ్రతాలకు ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇందులో భాగంగా నేడు తొలి శ్రావణ శుక్రవారం పౌర్ణమి ముందుగా వస్తున్నందున వరాలనిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఇంటా వేడుకగా జరుపుకుంటారు.

వరలక్ష్మి వ్రత వేడుకల సందడి
పీలేరులోని పూలదుకాణాల వద్ద మహిళల సందడి

పీలేరు, ఆగస్టు 4:శ్రావణ మాసం పూజలు, వ్రతాలకు ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇందులో భాగంగా నేడు తొలి శ్రావణ శుక్రవారం పౌర్ణమి ముందుగా వస్తున్నందున వరాలనిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఇంటా వేడుకగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి ఇంటా వరాల తల్లి వరలక్ష్మి కొలువుదీరాలంటూ వివిధ రకాల పూలు, పండ్లతో వరలక్ష్మిదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీంతో ముందురోజైన   గురువారం పీలేరులో వరలక్ష్మి వ్రత పూజల కోసం  సందడి నెలకొంది. తెలుగింటి ఆడపడుచులు అత్యంత శాస్ర్తోక్తం గా జరుపుకునే పండుగల్లో వరలక్ష్మి వ్రతం కావడంతో  పండుగకు కావా ల్సిన పూజా సామగ్రి, పూలు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసేం దుకు గురువారం మధ్యాహ్నం నుంచి పెద్దఎత్తున మహిళలు దుకాణాల వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. పీలేరులోని ఎల్‌బీఎస్‌ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, సాయిబాబా గుడి వీధుల్లోని వస్త్ర దుకాణాలు, పూల దుకాణాలు మహిళలతో కిటకిటలాడాయి. 

మదనపల్లె అర్బన్‌లో: పట్టణంలో శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం వరలక్ష్మీవ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. పట్టణంలోని వరాల ఆంజనేయస్వామి ఆలయంలో  ఆలయకమిటీ ఆధ్వర్యంలో, అనప గుట్టలోని గోవర్థన్‌గిరిలో శ్రీకృష్ణాలయంలో  వరలక్ష్మీవ్రతం పూజలు నిర్వహిస్తునట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.  వాసవీభవన్‌ వీధిలోని కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో శుక్రవారం మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌ ఆధ్వ ర్యంలో వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-08-05T05:24:31+05:30 IST