ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-05T04:53:35+05:30 IST

వైఎస్‌ జగనమోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వా త ప్రజలపై అన్ని రకాల ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు సంగటి గంగిరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చంద్ర ఓబుళరెడ్డి ధ్వజమెత్తారు.

ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం
ప్రజలతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

టీడీపీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డి

పెండ్లిమర్రి, ఆగస్టు 4: వైఎస్‌ జగనమోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వా త ప్రజలపై అన్ని రకాల ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు సంగటి గంగిరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చంద్ర ఓబుళరెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గ ఇనచార్జి పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని కొత్తసంగటిపల్లె గ్రామంలో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి టీడీపీ నేతలు తిరుగుతూ జగనమోహనరెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, మోసపూరిత మాటలను ప్రజలకు వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరించారు.  చెత్త మీద కూడా పన్నులు విధిస్తూ ప్రజలకు అదనపు భారాన్ని మోపుతున్నారని, ఈసారైనా ప్రజలు మేలుకోకపోతే ఆంధ్రప్రదేశ రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత మండల అధ్యక్షుడు రామగంగిరెడ్డి, పొలతల మాజీ చైర్మన విశ్వనాథరెడ్డి, కడప మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ అయ్యవారురెడ్డి, టీడీపీ నేతలు బయన్న, చీమలపెంట సర్పంచ ప్రతా్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T04:53:35+05:30 IST