-
-
Home » Andhra Pradesh » Kadapa » The development of the state is with Chandrababu-MRGS-AndhraPradesh
-
చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి
ABN , First Publish Date - 2022-09-18T05:11:27+05:30 IST
వైసీపీ మూడేళ్ల పాలనలో అప్పులతో కూరుకు పోయి అథఃపాతాళానికి వెళుతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని మదనపల్లె టీడీపీ నేత ఎస్.జయరామనాయుడు పేర్కొ న్నారు.

మదనపల్లె టౌన్, సెప్టెంబరు 17: వైసీపీ మూడేళ్ల పాలనలో అప్పులతో కూరుకు పోయి అథఃపాతాళానికి వెళుతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని మదనపల్లె టీడీపీ నేత ఎస్.జయరామనాయుడు పేర్కొ న్నారు. శనివారం మండంలోని చీకిలబై లు గ్రామంలో సర్పంచ్ ప్రభాకర్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ ఒక్క అవ కాశ ఇవ్వండంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నియంతృత్వ పోకడలతో మూడు రాజ ధానులంటూ అమరావతి రైతులను మోసం చేస్తున్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో మదన పల్లె నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పోరా డాలన్నారు. తాను ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నా రు. అనంతరం శివ, శ్రీనివాసులు, లక్ష్మినారాయణ, లక్ష్మిదేవమ్మ, శాంతమ్మ, గౌరీ తదితరులతో కలిసి 14 మంది వైసీపీ నాయకులు జయరామనాయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వైసీపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు నచ్చక తాము టీడీపీలో చేరుతున్నా మని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాజన్న, మహేశ్వర్‌రెడ్డి, చలపతినాయుడు, పెంచుపాడుస్వామి, రామచంద్ర, యుగంధర్, తెలుగు యువత నాయకుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.