వాగులో తేలిన శవం ఆటోడ్రైవర్‌దే..!

ABN , First Publish Date - 2022-10-14T04:49:31+05:30 IST

పీలేరు మండలం గూడరేవుపల్లె వాగులో తేలిన శవం ఆటోడ్రై వర్‌దేనని నిర్ధారణ అయింది.

వాగులో తేలిన శవం ఆటోడ్రైవర్‌దే..!
మృతుడు సుబ్రహ్మణ్యం

 నిర్ధారించిన తల్లి, సోదరులు 

పీలేరు, అక్టోబరు 13: పీలేరు మండలం గూడరేవుపల్లె వాగులో తేలిన శవం ఆటోడ్రై వర్‌దేనని నిర్ధారణ అయింది. అతను చిత్తూ రు జిల్లా పులిచెర్ల మండలం పాపిరెడ్డిగా రిపల్లె పంచాయతీ మిట్టమీదపల్లెకు చెంది న సుబ్రహ్మణ్యం ఆచారి(30)గా పోలీసు విచారణలో తేలింది. గూడరేవుపల్లె వాగులో బుధవారం మధ్యాహ్నం పూర్తిగా కుళ్లిపోయి న శవం తేలడం, అది గత నెల 20వ తేదీన వాగులో బోల్తాపడిన ఆటో డ్రైవర్‌దే అయివుం టుందని అందరూ అనుమానించిన విషయం తెలిసిందే. అందరి అనుమానాలు నిజం చేస్తూ అది ఆటో డ్రైవర్‌దేనని అతని తల్లి, సోదరు లు గుర్తించారు. శవం తేలిన తరువాత  విచారణ ప్రారంభించిన పోలీసులు డ్రైవర్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు గురువారం ఉదయం గూడరేవుపల్లె వాగు వద్దకు చేరుకుని మృతదేహంపైన ఉన్న జీన్స ప్యాంట్‌, నడుముకు ఉన్న మొలత్రాడు ఆధారంగా అతనిని గుర్తించారు. పులిచెర్ల మండలం పాపిరెడ్డిగారిపల్లె పంచాయతీ మిట్టమీదపల్లెకు చెందిన అనసూయమ్మ, శివాచారి దంపతుల కుమారుడైన సుబ్రహ్మణ్యం ఆచారి గత ఐదేళ్లుగా చెడు వ్యసనాలకు బానిసై కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. పీలేరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ పీలేరు, తిరుపతిలలో ఆటోలను రోజువారీ అద్దెకు నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన తిరుపతి నుంచి ఆటోను అద్దెకు తెచ్చుకుని పీలేరు మండలం తలపుల గ్రామానికి బాడుగకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతనిని గూడరేవుపల్లె వద్ద స్థాని కులు గమనించి ఆటోను నెమ్మదిగా నడపమని సలహా ఇచ్చారు. అయినప్పటికీ అతను వినకుండా ఆటోను వేగంగా నడిపి గూడరేవుపల్లె వాగులో ఆటోతో సహా బోల్తాపడ్డాడు. ఆ ప్రమాదంలో అతను అప్పటికప్పుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయం లో వాగులో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగి ఉండడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన గాలింపు చర్యలు నిష్ఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అతని శవం బుధవారం మధ్యాహ్నం వాగులో తేలడం, పోలీసుల విచారణ చేపట్టడం జరిగింది. శవం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు శ్రీనివాస నాయక్‌, పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి గురువారం సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అతని తల్లి అనసూమయ్యకు అప్పగించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-10-14T04:49:31+05:30 IST