వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2022-12-07T23:14:32+05:30 IST

ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైఎస్‌ఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జి రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
నక్కలవాండ్లపల్లెలో పర్యటిస్తున్న మాజీ ఎమ్మెల్యే రమే్‌షకుమార్‌రెడ్డి

ఫమాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి

గాలివీడు, డిసెంబరు 7: ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైఎస్‌ఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జి రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నూలివీడు పంచాయతీ నక్కలవాండ్లపల్లెలో ఆ యన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ప్రస్తుత ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. ముఖ్యంగా బీసీలపై కప ట ప్రేమ చూపుతోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారన్నారు. రైతులు, కార్మికులు, కర్షకులు, మైనార్టీలు బీసీలు ఈ ప్రభుత్వాన్ని సాగనంప డానికి ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పె ద్దు చిన్నపరెడ్డి, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, యోగాంజనేయులు, నూలివీడు వెంక ట్రమణ, వీరాంజనేయులు, నక్కల పెద్దరెడె ్డప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విగ్రహం మాయం .. ప్రభుత్వ కుట్రే..

రాయచోటిటౌన్‌: జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్ర హం మాయం ప్రభుత్వ కుట్ర అని రాయచోటి ని యోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆ యన పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాల యాల ధ్వంసం, విగ్రహాల కూల్చివేతలు అధిక మయ్యాయన్నారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కి, వారిపైనే దాడులు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి, వారి అనుచరులకు గుణపాఠం చెప్పే రోజులు ద గ్గర పడ్డాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం మాయం చే యడం ప్రభుత్వ దురహంకారానికి పరాకాష్ట అన్నారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని మాయం చేయ డం నీతిమాలిన చర్య అని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌ వలి, రాజంపేట పార్లమెంట్‌ మైనార్టీ సెల్‌ ఉపాఽ ద్యక్షుడు అబూజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:15:07+05:30 IST