ప్రమాదవశాత్తు కింద పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-03-17T04:47:24+05:30 IST

కడప నగరం రామచంద్రాపురం వద్ద ప్రమాదవశాత్తు నాలుగు నెలల బాలుడు మెట్లపై నుంచి కింద పడి మృతి చెందినట్లు తాలూకా ఎస్‌ఐ హుస్సేన్‌ తెలిపారు.

ప్రమాదవశాత్తు కింద పడి చిన్నారి మృతి
మృతిచెందిన నాలుగు నెలల బాబు

కడప(క్రైం), మార్చి 16 : కడప నగరం రామచంద్రాపురం వద్ద ప్రమాదవశాత్తు నాలుగు నెలల బాలుడు మెట్లపై నుంచి కింద పడి మృతి చెందినట్లు తాలూకా ఎస్‌ఐ హుస్సేన్‌ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... రామచంద్రాపురానికి చెందిన తాండ్రపాటి పుల్లయ్య, భారతి దంపతులకు ఇరువురు కుమార్తెలతో పాటు నాలుగు నెలల బాబు ఉన్నాడు. మంగళవారం రాత్రి బాబు సరిగా నిద్రపోకపోవడంతో తెల్లవారుజామున రెండో అంతస్తులోని అత్తామామల వద్దకు బాలుడిని తీసుకొని వెళుతుండగా ప్రమాదవశాత్తు చేతిలో నుంచి జారి మెట్లపై నుంచి పడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా భర్త పుల్లయ్య ఫాతిమ మెడికల్‌ కళాశాలలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

Read more