‘భావన’ భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-07T23:29:41+05:30 IST

భావన టౌన్‌షిప్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అక్రమాలపై విశ్రాంత హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ 15వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని తీర్మానించింది.

‘భావన’ భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి
అఖిలపక్ష నేతల సమావేశంలో మాట్లాడుతున్న రవిశంకర్‌ రెడ్డి

15 నుంచి రిలే నిరాహార దీక్షలు ఫ అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ తీర్మానం

కడప సెవెన్‌ రోడ్స్‌, డిసెంబరు 7: భావన టౌన్‌షిప్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అక్రమాలపై విశ్రాంత హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ 15వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని తీర్మానించింది. స్థానిక హరి టవర్స్‌లో బుధవారం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కాంగ్రెస్‌ నేత జకర య్య, బీసీ మహాసభ అఖిల భారత నేత అవ్వారు మల్లికార్జున, రాయలసీమ ఎస్సీ, ఎస్టీ హ్యూమన్‌ రైట్స్‌ ఫోరం నేతలు జేవీ రమణ, సీపీఐ నేతలు మల్లికార్జున, సలావుద్దీన్‌, జిల్లా ఆప్‌ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ భావన టౌన్‌షిప్‌ ప్రభుత్వ భూముల్లో నిర్మితమవడం విడ్డూరంగా ఉందని, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి రెండు నెలలుగా ఉద్య మం చేస్తున్నా అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం ఆశ్చర్యమన్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌పై హైకోర్టు రిటైర్డు జడ్జితో జరిపించాలని నేతలు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ను మరోసారి కలిసి జరిగిన లోపాలన్ని వివరించాలని తీర్మానించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోకపోతే ఉద్యమం తీవ్రస్థాయిలో వెళుతుందని హెచ్చరించారు. 15 నుంచి కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఆర్‌సీపీ, ఆర్‌ఎ్‌సవైఎఫ్‌, టీడీపీ, ఎమ్మార్పీఎస్‌, వికలాంగుల సంక్షేమ సంఘ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:29:43+05:30 IST