అదుపుతప్పి ఆటో బోల్తా

ABN , First Publish Date - 2022-10-13T04:47:36+05:30 IST

మండలంలోని మదనపల్లె- రాయ చోటి జాతీయ రహదారిపై తుమ్మలగొంది క్రాస్‌రోడ్డు ఎదురు గా ఆటో అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.

అదుపుతప్పి ఆటో బోల్తా

ఐదుగురికి తీవ్ర గాయాలు 

చిన్నమండెం, అక్టోబరు 12: మండలంలోని మదనపల్లె- రాయ చోటి జాతీయ రహదారిపై తుమ్మలగొంది క్రాస్‌రోడ్డు ఎదురు గా ఆటో అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. కేశాపురం గ్రామం ముండ్లవాండ్లకోట, పడమటికోనకు చెందిన వ్యవసాయ కూలీలు ఆటోలో వస్తుండగా.. వర్షం పడుతుండ డంతో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో రమణ మ్మ, సాధిక్‌, సయ్యద్‌బాషా, నాగేంద్ర, లలితకు తీవ్ర గాయాల వడంతో 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తర లించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప, తిరుపతి తీసుకెళ్లినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని, సంఘటనా స్థలానికి సిబ్బందిని పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read more