అప్రోచ్‌ రోడ్డుకు రెండు చోట్ల గండి

ABN , First Publish Date - 2022-12-13T23:37:27+05:30 IST

స్థానిక ముద్దనూరు రోడ్డులో అప్రోచ్‌రోడ్డు కు రెండు చోట్ల గండిపడ్డా యి.

అప్రోచ్‌ రోడ్డుకు రెండు చోట్ల గండి
రెండుచోట్ల రోడ్డు కోత

అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 13: స్థానిక ముద్దనూరు రోడ్డులో అప్రోచ్‌రోడ్డు కు రెండు చోట్ల గండిపడ్డా యి. మైలవరం జలాశయం నుంచి వరదనీరు మంగళవారం సుమారు ఏడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశా రు. దీంతో సోమవారం సాయంత్రం అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. జమ్మలమడుగు అర్బన్‌ సీఐ సదాశివయ్య దగ్గరుండి గూడెం చెరువుకు దగ్గరలో అప్రోచ్‌రోడ్డులో మట్టి తొలగించి వరదనీరును మళ్లించారు. కానీ మంగళవారం నీరు పెరగడంతో జమ్మలమడుగు వైపు పెన్నానదికి వంతెన దగ్గరలో కోతకు గురైంది. దీంతో అప్రోచ్‌ రోడ్డులోని రెండు చోట్ల గండిపడ్డాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టూ తిరిగి వెళ్లలేక వంతెన పనులు పూర్తికాక అప్రోచ్‌ రోడ్డుతో ఏడాది నుంచి సతమతం అవుతూ మధ్య మధ్యలో రోడ్డు కోతకు గురై తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2022-12-13T23:37:27+05:30 IST

Read more