సమాజ మార్పునకు మూలం ఉపాధ్యాయులే

ABN , First Publish Date - 2022-10-18T05:03:57+05:30 IST

సమాజ మార్పు, చైతన్యానికి మూలం ఉపాధ్యాయులేనని జిల్లా విద్యాశాఖాధికారి చెప్పలి దేవరాజ్‌, సమగ్ర శిక్ష జిల్లా అధికారి డాక్టర్‌ అంబవరపు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

సమాజ మార్పునకు మూలం ఉపాధ్యాయులే
సమావేశంలో మాట్లాడుతున్న సమగ్ర శిక్ష జిల్లా అధికారి ప్రభాకర్‌రెడ్డి

డీఈఓ దేవరాజ్‌, ఎస్‌ఎ్‌సఏ పీఓ ప్రభాకర్‌రెడ్డి


కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 17 : సమాజ మార్పు, చైతన్యానికి మూలం ఉపాధ్యాయులేనని జిల్లా విద్యాశాఖాధికారి చెప్పలి దేవరాజ్‌, సమగ్ర శిక్ష జిల్లా అధికారి డాక్టర్‌ అంబవరపు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప నగరం సీఎ్‌సఐ హైస్కూలులో గల డీసీఈబీ హాలులో కడప మండలానికి సంబంధించి టీచింగ్‌ అట్‌ ద రైట్‌ లెవల్‌ నాలుగురోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతో పాటు వినయ విధేయతలను, నైతిక విలువలను పెంపొందించే దిశగా బోధన సాగించాలన్నారు. చదువుతో పాటు ఆట పాటలు విద్యార్ధికి నేర్పించినప్పుడే ఆ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి పొందుతాడన్నారు. కార్యక్రమంలో కడప ఎంఈవో పాలెం నారాయణ, సీనియర్‌ రిసోర్స్‌ పర్సన్‌ శివారెడ్డి, బాలానాయుడు, సాహెబ్‌జాన్‌, కాంతావలి, నాగమణికుమారి, హజీరాభాను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:03:57+05:30 IST