ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-12-15T23:11:08+05:30 IST

మండల పరిధిలోని ముడుంపాడు పంచాయతీ శివరాంపురంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జీతానాయక్‌ను సస్పెన్షన్‌ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్‌నాయక్‌ తెలిపారు.

ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

సుండుపల్లె, డిసెంబరు 15: మండల పరిధిలోని ముడుంపాడు పంచాయతీ శివరాంపురంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జీతానాయక్‌ను సస్పెన్షన్‌ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్‌నాయక్‌ తెలిపారు. పాఠశాలకు ఎటువంటి సెలవు పెట్టకుండా గైర్హాజరు కావడంతో పాటు ఎంఆర్‌సీలో అధికారుల సమయం వృథా చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని డీఈవో రాఘవరెడ్డి ఆ ఉపాధ్యాయుడిని సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈవో తెలిపారు.

Updated Date - 2022-12-15T23:11:09+05:30 IST