బోధనలో సహకారం కోసమే టీచ్‌ టూల్‌ శిక్షణ

ABN , First Publish Date - 2022-12-15T23:21:02+05:30 IST

బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించ డానికే టీచ్‌ టూల్‌ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు టెక్నికల్‌ ప్రతినిఽధి సిద్దేశ్‌, రాష్ట్ర పరిశీలకులు పాండవుల సాయిరాం పేర్కొన్నారు.

బోధనలో సహకారం కోసమే టీచ్‌ టూల్‌ శిక్షణ

రాయచోటిటౌన్‌, డిసెంబరు 15: బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించ డానికే టీచ్‌ టూల్‌ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు టెక్నికల్‌ ప్రతినిఽధి సిద్దేశ్‌, రాష్ట్ర పరిశీలకులు పాండవుల సాయిరాం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్ష సహకారంతో ఎస్సీఆర్‌టీ ఆధ్వర్యంలో బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని గురువారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలుదేశాలలో తరగతి గదులలో బోధనా కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకా రం అందించే ఉద్దేశ్యంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికే 7వేల మందికిపైగా ప్రధానోపా ధ్యాయు లకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. తరగతి గది బోధనా భ్యసనలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశం అన్నారు. ప్రధానోపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధనాభ్యసన గురించి నిరంత రం పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చునన్నారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్‌ నాగేశ్వరరావు, మాస్టర్‌ ట్రైనర్స్‌ ముడితాటి నరసింహా రెడ్డి, జయచంద్ర, అబ్బవరం హరిబాబు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:21:06+05:30 IST