ముఖ్యమంత్రి జగన్ గారూ...రూ.3 వేలు పింఛన్ హామీ అమలెప్పుడు?
ABN , First Publish Date - 2022-01-03T05:07:54+05:30 IST
వృద్ధులకు పింఛన్ రూ.2 వేల నుండి రూ.3 వేలకు పెంచుతూ, అవ సరమైతే రూ.4 వేలు పెం చుతా అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీపై ముఖ్యమంత్రి జగన్ మాట తప్పి మడమ తిప్పారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆరోపించారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా
రాయచోటిటౌన్, జనవరి 2: వృద్ధులకు పింఛన్ రూ.2 వేల నుండి రూ.3 వేలకు పెంచుతూ, అవ సరమైతే రూ.4 వేలు పెం చుతా అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీపై ముఖ్యమంత్రి జగన్ మాట తప్పి మడమ తిప్పారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆరోపించారు. ఆదివారం ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఒకేసారి పింఛన్ రూ.2వేల నుండి రూ.3 వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మే 31, 2019న ప్రమాణ స్వీకార సభలో మాట మార్చి ప్రతి ఏడాది రూ.250 పెంచుకుంటూ పోతానని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అయితే అధికారం చేపట్టి ఇప్పటికీ మూడేళ్లు ముగుస్తున్నా పెంచి ఇచ్చింది కేవలం రూ.250 మాత్రమేనన్నారు. ఇదేనా మాట తప్పను మడమ తిప్పను అనడం అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యద ర్శి నూలివీడు వెంకటశివారెడ్డి, టీడీపీ నాయకులు రెడ్డెయ్య, రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.