టీడీపీ నేతలు సమన్వయంతో పనిచేయాలి
ABN , First Publish Date - 2022-10-18T04:26:08+05:30 IST
తంబళ్లపల్లె నియోజక వర్గంలో టీడీపీ నాయ కులందరూసమన్వయంతో పని చేస్తే పార్టీ విజయం ఖాయమని తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యనేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి అన్నారు .
పెద్దతిప్పసముద్రం అక్టోబర్ 17 : తంబళ్లపల్లె నియోజక వర్గంలో టీడీపీ నాయ కులందరూసమన్వయంతో పని చేస్తే పార్టీ విజయం ఖాయమని తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యనేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి అన్నారు .సోమవారం ఆయన కాట్నగల్లు, కందుకూరు, కమ్మచెర్వు, టి.సదుం, ఎగువపల్లె, పీటీఎం గ్రామాల్లో పర్యటించి టీడీపీ కార్యకర్తలను సమన్వయ పరిచి భరోసా కల్పించారు. పెనుగొండ ఆది, నాగార్జున, రమణ, నరసింహులు, రవి సిద్దప్ప, ఓబులేసు తదితరులు ఉన్నారు.