వైసీపీ ఆకృత్యాలను ఎదుర్కొన్న వారికి టీడీపీ అండ

ABN , First Publish Date - 2022-10-02T05:04:23+05:30 IST

వైసీపీ ప్రభు త్వం అవలంభిస్తున్న నిరంకుశ, అప్ర జాస్వామిక ఆకృత్యాలను ఎదుర్కొన్న వారందరికీ టీడీపీ అన్ని విధాలా అండగా నిలబడుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

వైసీపీ ఆకృత్యాలను ఎదుర్కొన్న వారికి టీడీపీ అండ
శాంతిపురంలో శ్రీనివాసులును పరామర్శిస్తున్న కిశోర్‌కుమార్‌రెడ్డి

కలికిరి, అక్టోబరు 1: వైసీపీ ప్రభు త్వం అవలంభిస్తున్న నిరంకుశ, అప్ర జాస్వామిక ఆకృత్యాలను ఎదుర్కొన్న వారందరికీ టీడీపీ అన్ని విధాలా అండగా నిలబడుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రధానంగా కుప్పం నియోజకవర్గం పై అన్ని వర్గాల్లోనూ విషం చిమ్ము తు న్నారని చెప్పారు. కుప్పం నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులును శనివారం శాంతిపురంలోని ఆయన ఇంట్లో కలిసి పరామర్శించారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసి అనేక రకాల అడ్డంకులు కలిగించిన విషయం తెలిసిందే. ఆ సంఘటనల్లో శ్రీనివాసులుతోపాటు పలువురి పైన అక్రమ కేసులు బనాయించగా ఇటీవలే బెయిలుపై విడుదలై వచ్చారు.  పుంగనూరు ఇన్‌చార్జి చల్లా రామచంద్రా రెడ్డి,  ఇందుశేఖర్‌,  సురేష్‌, తిరుపతి కార్పొరేటర్‌ ఆర్పీ మునికృష్ణయ్య,  నేతలుఉన్నారు.  


Read more