హరిత హోటల్‌ను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2022-08-05T05:07:57+05:30 IST

జమ్మలమడుగు మండలంలోని గండికోట పర్యాటక ప్రాంతమైన హరిత హోటల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కడప పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ గిరిధర్‌రెడ్డి, స్థానిక అధికారి మురళి తెలిపారు.

హరిత హోటల్‌ను సద్వినియోగం చేసుకోండి

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 4: జమ్మలమడుగు మండలంలోని గండికోట పర్యాటక ప్రాంతమైన హరిత హోటల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కడప పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ గిరిధర్‌రెడ్డి, స్థానిక అధికారి మురళి తెలిపారు. హరిత హోటల్‌ ప్రాంగణంలో ఎవరైనా వివాహాలు జరుపుకోవడానికి, ఫంక్షన్లు, వివిధ కంపెనీల సమావేశాలు జరుపుకొనుటకు అనుమతి ఇచ్చారన్నారు. అందులో అక్కడికి వచ్చినవారికి వెజ్‌, నాన్‌వెజ్‌ ఆహారాన్ని తయారు చేసి సరసమైన ధరలకు తమ సిబ్బంది అందిస్తారన్నారు. అవసరమైనవారు 9705933311, 9490135367కు ఫోన్‌ చేసి తెలపాలన్నారు. 

Updated Date - 2022-08-05T05:07:57+05:30 IST