ఎఫ్‌ఎన్‌వోపై సస్పెన్షన్‌ వేటు

ABN , First Publish Date - 2022-03-06T04:35:30+05:30 IST

కాన్పు అనంతరం అడిగిన డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో సదరు బాలింతకు లేని జబ్బును అంటగట్టిన ఘటనకు సంబంధించి ఎఫ్‌ఎన్‌వో లతను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ జేసీ సాయికాంత్‌వర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి సమగ్ర విచారణకు అదేశించారు

ఎఫ్‌ఎన్‌వోపై సస్పెన్షన్‌ వేటు

ప్రొద్దుటూరు క్రైం, మార్చి 5 : కాన్పు అనంతరం అడిగిన డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో సదరు బాలింతకు లేని జబ్బును అంటగట్టిన ఘటనకు సంబంధించి ఎఫ్‌ఎన్‌వో లతను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ జేసీ సాయికాంత్‌వర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి సమగ్ర విచారణకు అదేశించారు. ఈ విషయాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ సెల్వరాజ్‌ తెలిపారు. చాపాడు మండలానికి చెందిన ఓ గర్భిణీ పురిటి నొప్పులతో గత నెల 27 ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఆ రోజునే ఆడ శిశువును ప్రసవించింది. అయితే కాన్పు చేసినందుకు ఎఫ్‌ఎన్‌వో లత ఆమెను రూ.2 వేలు డిమాండు చేసింది. ఈ క్రమంలో అడిగిన డబ్బులు ఇవ్వలేదని పురిటిబిడ్డను చూసేందుకు బాలింత భర్త రాగా, ఆమెకు లేని జబ్బు అపాదిస్తూ అతడితో చెప్పింది. ఈ ఘటన సంచలనం అయింది. దీంతో ఆస్పత్రి అధికారులు ఎఫ్‌ఎన్‌వో ప్రవర్తనపై జేసీ సాయికాంత్‌ వర్మకు ఫిర్యాదు చేశారు. అ క్రమంలోనే ఎఫ్‌ఎన్‌వోపై ఉన్నతాధికారులు ఇక్కడి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నారు. ఈ మేరకు జేసీ సాయికాంత్‌వర్మ ప్రస్తుతానికి సస్పెండ్‌ చేస్తూ, పూర్తి స్థాయిలో విచారణ చేసి మరోకమారు నివేదిక ఇవ్వాలని అదేశించినట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డేవిడ్‌ సెల్వరాజ్‌ తెలిపారు. 

Read more