బయటపడిన 16వ శతాబ్ధపు జాంబవంతుడి శాసనం
ABN , First Publish Date - 2022-12-02T23:21:44+05:30 IST
జిల్లాలోని అతి పురాతన ప్రాంతం జ్యోతి గ్రామంలో 16వ శతాబ్ధం నాటి జాంబవంతుని శాస నం బయటపడింది. మండలానికి పడమ ర దిక్కున 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామ భూమి లో మూడు అడుగు ల లోతులో ఉన్న ఈ శాసనాన్ని గ్రా మ పెద్దలు వెలికి తీసి ప్రతిష్ఠించారు.
సిద్దవటం, డిసెంబ రు2: జిల్లాలోని అతి పురాతన ప్రాంతం జ్యోతి గ్రామంలో 16వ శతాబ్ధం నాటి జాంబవంతుని శాస నం బయటపడింది. మండలానికి పడమ ర దిక్కున 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామ భూమి లో మూడు అడుగు ల లోతులో ఉన్న ఈ శాసనాన్ని గ్రా మ పెద్దలు వెలికి తీసి ప్రతిష్ఠించారు. సీనియర్ పాత్రికేయులు, దక్షిణ భారత పర్యాటక సంస్థ ప్రధాన కార్యదర్శి జార్జి ఈ శాసనం చిత్రాన్ని మైసూరులోని శాస్త్ర పరి శోధకులు ఆచార్య మునిరత్నం రెడ్డికి పంపించగా ఆయన పరి శీలించి ఇది తెలుగు భాషలో చెక్కబడి ఉందని 16వ శతా బ్ధం నాటి అక్షరాల్లో రాయబడిందని వివరించారు.
హనుమంతుని ప్రతిమను స్థానిక ప్రజలు జాంబవంతుడని పిలుస్తారని చెప్పా రు. రెడ్డి, కరణాలు నలుగురు విలేజ్ అకౌంటెంట్లు గ్రామం లోని నరగడ్డ వద్ద ఉన్న భూములను బహు మతిగా ఇచ్చి నట్లు రికార్డు చేసినట్లు తెలుస్తోందని చెప్పారు. అనంతరం జర్నలిస్ట్ జార్జి మాట్లాడుతూ ఇలాంటి పురాతన చరిత్రను ఆనవాళ్లను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇక్కడ ఒక దేవాలయం నిర్మించి సంరక్షణ కోసం గ్రామంలో ఉన్న వ్యక్తిని నియమించాలని కోరారు.