అతిథి ఉపన్యాసకులను ఆదుకోండి
ABN , First Publish Date - 2022-08-09T05:01:24+05:30 IST
తమను ఆదుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. హరిప్రసాద్‌కు అతిథి ఉపన్యాసకులు విశ్వనాథ్, వెంకటరమణ, సురేంద్ర, సుబ్రహ్మణ్యంరెడ్డి సోమవారం వినతిపత్రం సమర్పించారు.

రైల్వేకోడూరు, ఆగస్టు 8: తమను ఆదుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. హరిప్రసాద్‌కు అతిథి ఉపన్యాసకులు విశ్వనాథ్, వెంకటరమణ, సురేంద్ర, సుబ్రహ్మణ్యంరెడ్డి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళు ్లగా డిగ్రీ కళాశాలలో అతిథి ఉప న్యాసకులుగా పని చేస్తున్నామని తెలిపారు. గంటకు రూ. 2000 వేలు ఇస్తున్నారన్నారు. పెరిగిన ధరల కారణంగా గంటకు రూ. 5000 వేలు ఇవ్వాలన్నారు. లేదా నెలకు రూ. 30,000 వేలు వేతనం ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఇన్చార్జి ప్రిన్సిపాల్ హరిప్రసాద్ వివరించారు.