వృద్ధులు, వికలాంగులకు తోడ్పాటు

ABN , First Publish Date - 2022-05-30T05:50:35+05:30 IST

వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు రక్షణ, మెరుగైన జీవి తం గడిపి జీవితంలో అభివృద్ధి చెందేందుకు వీలుగా అలిమ్‌కో సంస్థ ఆర్టీఫిషియల్‌ లిమ్స్‌ మ్యానిఫ్యక్చరింగ్‌ కంపెనీ తోడ్పాటుతో వివిధ రకాల వినికిడి యంత్రాలు, చేతికర్రలు, వీల్‌చైర్స్‌, మోకాలి కదలికలకు అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

వృద్ధులు, వికలాంగులకు తోడ్పాటు

చెన్నూరు, మే 29 : వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు రక్షణ, మెరుగైన జీవి తం గడిపి జీవితంలో అభివృద్ధి చెందేందుకు వీలుగా అలిమ్‌కో సంస్థ ఆర్టీఫిషియల్‌ లిమ్స్‌ మ్యానిఫ్యక్చరింగ్‌ కంపెనీ తోడ్పాటుతో వివిధ రకాల వినికిడి యంత్రాలు, చేతికర్రలు, వీల్‌చైర్స్‌, మోకాలి కదలికలకు అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు మండలంలోని 9 సచివాలయాల్లో వృద్ధులకు, వికలాంగులకు పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందిరికీ అలిమ్‌కో సంస్థ మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన పరికరాలను త్వరలో అందిస్తామని ఆయన తెలిపారు. కాగా మూడు రోజులలో 2150 మంది వృద్ధులు, 479 మంది వికలాంగులకు పరీక్షలు నిర్వహించినట్లు ప్రత్యేకాధికారి తెలిపారు. అలాగే ఆదివారం వైద్యాధికారులు చెన్నారె డ్డి, బాలకొండ్రాయుడు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

Updated Date - 2022-05-30T05:50:35+05:30 IST