‘పాత పద్ధతిలోనే వేసవి సెలవులు ప్రకటించాలి’

ABN , First Publish Date - 2022-04-25T04:45:06+05:30 IST

పాత విధానంలోనే విద్యాసం స్థలకు వేసవి సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘా ల సమన్వయ వేదిక, ఏపీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఏపీ సీపీఎస్‌ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమి టీ చైర్మన్‌ శ్రీయపురెడ్డి వెంకట జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

‘పాత పద్ధతిలోనే వేసవి సెలవులు ప్రకటించాలి’

కడప(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 24: పాత విధానంలోనే విద్యాసం స్థలకు వేసవి సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘా ల సమన్వయ వేదిక, ఏపీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఏపీ సీపీఎస్‌ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమి టీ చైర్మన్‌ శ్రీయపురెడ్డి వెంకట జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాల విద్యకు ఏటా ఏప్రిల్‌ 24 నుంచి సెలవులు ప్రకటించి జూన్‌ నెల రెండో వారంలో పునఃప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కానీ ఇప్పుడు దీనికి విరుద్దం గా మే 6వ తేదీ నుంచి సెలవులు ప్రకటించి, ఉపాధ్యాయుల కు మాత్రం మే 21వ తేదీ నుంచి సెలవులు ప్రకటించటం అన్యాయమన్నారు.

పాత విధానంలోనే విద్యా సంస్థలకు వేస వి సెలవులు ప్రకటించాలని కోరారు. వార్షిక పరీక్షల మూ ల్యాంకనం, మార్కులు రిజిస్టర్లు, ఆన్‌లైన్‌లో నమోదు, విద్యార్థులు ప్రమోషన్‌ లిస్టులు, నూతన అడ్మిషన్ల ప్రక్రియ, టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల విధులు  కొన్ని దశాబ్దాల నుంచి వేసవి సెలవుల్లోనే సజావుగా సాగుతున్నప్పుడు ఈ ఏడాది మాత్రం మే 20 వరకు పాఠశాలలకు హాజరవమని ఉత్తర్వులు ఇవ్వడం సబబు కాదన్నారు. కరోనా కాలంలోనే నాడు నేడు మొదటి ఫేజ్‌ పనులను దిగ్విజయంగా ప్రధానోపాధ్యాయులు పూర్తి చేశారని ఆయన గుర్తు చేశారు.  పాఠశాలకు ముగ్గురో, నలుగురో ఉపాధ్యాయులు టెన్త్‌, ఇంటర్‌ విధులకు హాజరవుతార ని, వీరి కోసం మిగిలిన ఉపాధ్యాయులందరినీ పాఠశాలకు రప్పించడం సరైన విధానం కాదని తెలిపారు. రుతువులను అనుసరించి వేసవి కాలానికి అనుగుణంగా ఏప్రిల్‌ నెలలో పాఠశాల విద్య, ఇతర విద్యాశాఖల్లో సెలవులు ప్రకటించి వర్షాకాలం ప్రారంభం కాగానే జూన్‌లో విద్యా సంస్థలు పునః ప్రారంభించేవారన్నారు.

ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు సెలవులు ప్రకటించడం అన్యాయమన్నారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు వేసవి సెలవులనేవే లేకండా పోయాయని, ఈ ఏడాది వెంటనే వీరి కి వేసవి సెలవులు ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని విడుదల చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేసి అందరికీ మే 6వ తేదీ నుంచి సెలవులు ప్రకటించి అవసరమైతే జూన్‌ నెల మూడో వారంలో పాఠశాలలు పునఃప్రారంభించాలని వారు సూచించారు.

Read more