-
-
Home » Andhra Pradesh » Kadapa » Students need a better education-MRGS-AndhraPradesh
-
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
ABN , First Publish Date - 2022-02-20T04:50:06+05:30 IST
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి ఉపాధ్యాయు లకు సూచించారు.

పులివెందుల టౌన్, ఫిబ్రవరి 19: విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి ఉపాధ్యాయు లకు సూచించారు. శనివారం రమణప్ప సత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అహోబిళాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంకాళమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్జేడీ మాట్లాడుతూ మే నెలలో 10వ తరగతి పబ్లిక్ రీక్షలు జరగబోతున్నందున విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. స్టడీఅవర్ అమలు చేయాలని, విద్యార్థుల హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. కెరీర్ గైడెన్స్ అమలును పరిశీలించారు. పాఠశాలలో తక్కువ ఖర్చుతో విద్యార్థులు తయారుచేసిన వస్తువులను పరిశీలించిన విద్యార్థుల కృషిని మెచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ వీరారెడ్డి, సీఆర్పీ ఓబులేసు, సిబ్బంది పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
బద్వేలు రూరల్, ఫిబ్రవరి 19 : పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతోపాటు పరిసరాల పరిశుభ్రతపై అవగా హన కల్పించాలని జిల్లా సమగ్రశిక్ష పథక అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలు, విద్యార్థుల వసతి, జగనన్న గోరుముద్ద, టాయిలెట్స్ తదితర అం శాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలను దూరం చేసేది విద్యమాత్రమేనని ప్రతి విద్యార్థి సేవా భావం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో చెన్నయ్య, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం విజయ్‌కుమార్‌రెడ్డి, గోపవరం పాఠశాల ప్రధానోపాఽధ్యాయులు వెంకటరామిరెడ్డి, సత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.