ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2022-11-11T23:35:12+05:30 IST

అడవుల సంరక్షణకు, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి మరిన్ని పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని మొబైల్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని అటవీ శాఖ పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు) వై.మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు
విలేకరులతో మాట్లాడుతున్న మధుసూదన్‌రెడ్డి

ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు మార్గాల్లో మరిన్ని మొబైల్‌ చెక్‌పోస్టులు

అటవీ శాఖ పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి

బి.కొత్తకోట, నవంబరు 11: అడవుల సంరక్షణకు, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి మరిన్ని పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని మొబైల్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని అటవీ శాఖ పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు) వై.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లాలోని హర్సిలీహిల్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టుబడిన ఎర్రచంద నం 5,600 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉందని, ఈ ఎర్రచందనాన్ని వేలం ద్వా రా విక్రయించడానికి గ్లోబల్‌ టెండర్లు త్వరలో పిలువనున్నామని ఆయన తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయం ద్వారా రూ.2 వేల కోట్లు ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అడవుల అభి వృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అటవీ శాఖలో బీట్‌ ఆఫీసర్ల కొరత ఉందని, వెయ్యి మంది బీట్‌ ఆఫీసర్లు, వంద మంది సెక్షన్‌ ఆఫీసర్లను రిక్రూట్‌ చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధాన మార్గాలు, పట్టణాల సమీపంలో అటవీ ప్రాంతం అనువుగా ఉన్న చోట ప ర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి, విక్షించడానికి అనువుగా పార్కులు, పర్యాటక ప్రదేశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఈ సమావేశంలో అటవీశాఖ తిరుపతి పీసీఎఫ్‌ నాగేశ్వరరావ్‌, చిత్తూరు డీఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్‌, కడప డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

హార్సిలీహిల్స్‌ సమగ్రాభివృద్ధికి చర్యలు

హార్సిలీహిల్స్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నా మని అటవీశాఖ పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయ న హార్సిలీహిల్స్‌లోని అటవీశాఖ ప్రాంగణాన్ని, మినీ జూపార్కును, హిల్స్‌ ఘాట్‌ రోడ్డులోని గంగోత్రి చెరువును పరిశీలించారు. అలాగే సెంట్రల్‌ జోన్‌ అథారిటీకి లోబడి హిల్స్‌లోని మినీ జూపార్కులో జంతువులు, పక్షు లు మరిన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్థానిక అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తిరుపతి సీపీఎఫ్‌ నాగేశ్వరరావ్‌, చిత్తూరు, కడప డీఎఫ్‌వోలు చైతన్యకుమార్‌రెడ్డి, సందీప్‌ రెడ్డి, అన్నమయ్య జిల్లా సోషల్‌ ఫారెస్ట్‌ డీఎఫ్‌వో నాగమణేశ్వరి, మదనపల్లె రేంజర్‌ మదనమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:35:12+05:30 IST

Read more