సీడీపీవోపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీఐటీయూ
ABN , First Publish Date - 2022-08-05T05:08:58+05:30 IST
అంగన్వాడీ ఆయాల రిటైర్డుమెంట్ బెనిఫిట్స్ విషయంలో అన్యాయం చేసిన జమ్మలమడుగు సీడీపీవో రాజేశ్వరిపై ఉన్నతాధికారులు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ, బాధిత ఆయా సుబ్బమ్మ డిమాండ్ చేశారు గురువారం సాయంత్రం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద వారు మాట్లాడారు.
జమ్మలమడుగు రూరల్, ఆగస్టు 4: అంగన్వాడీ ఆయాల రిటైర్డుమెంట్ బెనిఫిట్స్ విషయంలో అన్యాయం చేసిన జమ్మలమడుగు సీడీపీవో రాజేశ్వరిపై ఉన్నతాధికారులు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ, బాధిత ఆయా సుబ్బమ్మ డిమాండ్ చేశారు గురువారం సాయంత్రం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద వారు మాట్లాడారు. జమ్మలమడుగు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని రాజుపాళెం మండలం పొట్టిపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సుబ్బమ్మ హెల్పర్‌గా పనిచేస్తూ 2018 జనవరి 30న తేదీన పదవీ విరమణ పొందడం జరిగిందన్నారు. వీరి సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో రిటైర్డుమెంట్ బెనిఫిట్స్ కింద రూ.25 వేలు అకౌంట్‌కు జమ చేయడం జరిగిందన్నారు. అయితే సుబ్బమ్మ ఐసీడీఎస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందించలేదని వాపోయారు. వేరే అకౌంట్‌కు పంపించి తనకు డబ్బులు రాకుండా చేశారని, ఉన్నతాధికారులు సీడీపీవోపై విచారణ జరిపించాలని వారు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.