అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-03-06T04:50:48+05:30 IST

ఉపాధి నిధుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పీడీ యదుభూషణ్‌రెడ్డి అన్నారు. శనివారం ఉపాధి హామీ కార్యాలయం ప్రాంగణలో పనులపై తనిఖీ నిర్వహించారు.

అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

ఉపాధి పనుల తనిఖీలో పీడీ

ఒంటిమిట్ట, మార్చి5: ఉపాధి నిధుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పీడీ యదుభూషణ్‌రెడ్డి అన్నారు. శనివారం ఉపాధి హామీ కార్యాలయం ప్రాంగణలో పనులపై తనిఖీ నిర్వహించారు. 2021-22కి ఉపాధి కింద చేపట్టిన పనులను పంచాయతీల వారీ  తనిఖీ నిర్వహించారు. హార్టీకల్చర్‌ అటవీ శాఖ పం చాయతీ వ్యవసాయం, పశుసంవర్ధక, గృహ నిర్మాణ శాఖ చేపట్టిన పనుల తనిఖీ చేశారు. పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిని గుర్తించి రికవరీ చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ పీడీ శివప్రసాద్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ రామచంద్రారెడ్డి, ఎస్‌ఆర్‌పీ కాంతయ్య, ఎంపీడీఓ మల్‌రెడ్డి, ఏపీఓ భార్గవి సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T04:50:48+05:30 IST