అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-10-08T04:23:49+05:30 IST

ఎరువుల దుకాణ దారులు ప్ర భుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటా మని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఉమామహేశ్వర్‌ హెచ్చరిం చారు.

అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
దుకాణంలో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

గాలివీడు, అక్టోబరు7: ఎరువుల దుకాణ దారులు ప్ర భుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటా మని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఉమామహేశ్వర్‌ హెచ్చరిం చారు. శుక్రవారం విజిలెన్స్‌ అధికారులు మండలంలో ని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. మహమ్మద్‌ అనాజ్‌ ఎరువుల దుకా ణ దారులు యూరియాను రూ.300కు అమ్ముతున్నాడు.

నిర్ణయించిన ధర కన్నా ఎక్కువగా అమ్ముతుండడాన్ని గుర్తించి పట్టుకున్నామని, అందులో ఉన్న యూరి యా మొత్తాన్ని సీజ్‌ చేసి 6ఏ కింద కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు పంపామన్నా రు. మన్విత ఫస్ట్‌ సైట్స్‌ దుకాణాన్ని కూడా తనిఖీ చేశామని, నిల్వ ఉన్న కొన్ని రకాల పురుగుల మందులను పట్టుకున్నామన్నారు. ఎవరైనా ఎరువులను కృత్రిమ కొరత సృష్టించిన నకిలీ మందులను అమ్మినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాష, బాలగంగాధర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రామాంజనేయచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:23:49+05:30 IST