గ్రీన జోనలోనే వీధి విక్రయదారులు చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T04:14:01+05:30 IST

కడప నగర పరిధిలో ఏర్పాటు చేసిన గ్రీన జోనలోనే వీధి విక్రయదారులు వ్యాపారాలు చేయాలని కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ సూచించారు.

గ్రీన జోనలోనే వీధి విక్రయదారులు చేయాలి
వీధి విక్రయదారుల కమిటి సభ్యులతో మాట్లాడుతున్న కమిషనర్‌

ప్రతి వ్యాపారికీ గుర్తింపు కార్డు - కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌

కడప (ఎర్రముక్కపల్లె), అక్టోబరు 7 :కడప నగర పరిధిలో ఏర్పాటు చేసిన గ్రీన జోనలోనే వీధి విక్రయదారులు వ్యాపారాలు చేయాలని కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ సూచించారు. ప్రతి ఒక్కరికీ వారికి కేటాయించిన జోన్లలో గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్పోరేషన కమిషనర్‌ ఛాంబరులో శుక్రవారం సాయంత్రం వీధి విక్రయదారుల కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వీధి విక్రయదారులు ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా మానివేసి వాటి స్థానంలో ప్లాస్టిక్‌ రహిత సంచులను ఇతర వస్తువులు వాడాలని తెలిపారు. అలాగే అందరికీ తెలిసేలా విరివిగా ప్రచారం నిర్వహించాలని మెప్మా వారికి పట్టణ సమైఖ్య సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంధ సంస్థలు, పౌర సమాజ సభ్యులను పాల్గొనేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక విభాగపు అధికారులు సంజీవ్‌కుమార్‌, డీసీపీ నాగేంద్ర, ఏసీపీ ప్రభాకర్‌నాయుడు, ఈఈ ప్రశాంత వర్ధన, ఎంఎ్‌సవో హకీం, లీడ్‌ బ్యాంకు మేనేజరు, పట్టణప్రాజెక్టు అధికారి శ్రీనివాసులు, సిటీ మిషన మేనేజర్లు హరి ప్రసాద్‌రెడ్డి, నాగేం్దర ప్రసాద్‌, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు స్వచ్చంధ సంస్థలు, కార్మిక సంఘాలు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T04:14:01+05:30 IST