ఇంకా పునాదుల్లోనే..!

ABN , First Publish Date - 2022-01-07T05:16:16+05:30 IST

ముఖ్యమంత్రి వైఎ్‌స జగనమో హనరెడ్డి మానసపుత్రిక అయిన ‘జగనన్న ఇళ్లు’ పథకం మూడు అడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంటి స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయనట్లు జగన సర్కార్‌ ఉచితంగానే స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తున్నామంటూ గొప్పగా చెప్పారు.

ఇంకా పునాదుల్లోనే..!

1,06,828 జగనన్న ఇళ్లు మంజూరు

గ్రౌండ్‌ లెవల్‌లో 66,097 ఇళ్లు

పునాదుల దశలో 56,518

పెరిగిన నిర్మాణ వ్యయంతో లబ్ధిదారుల అనాసక్తి

కాలనీల్లో మౌలిక వసతులూ కరువు

బిల్లుల చెల్లింపులో జాప్యం 


ఈ చిత్రంలో కనిపిస్తున్నది మామిళ్లపల్లి సమీపంలోని జగనన్న కాలనీ. ఇక్కడ 3,900 ప్లాట్లు వేశారు. 3,263 ఇళ్లు కేటాయించారు. పునాదుల దశలో 2,270 ఇళ్లు ఉన్నాయి. బేస్మట్టం లెవల్‌లో 523, రూఫ్‌ లెవల్‌లో 21, స్లాబ్‌ లెవల్‌లో 8 ఉండగా, మూడు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంటి నిర్మాణానికి తెచ్చుకున్న ఇసుక, ఇనుము, ఇటుక, ఇతర నిర్మాణ సామగ్రి ఇక్కడ ఉంచితే దొంగలిస్తున్నారు. భద్రత లేకపోవడంతో లబ్ధిదారులు నిర్మాణం పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో పాటు బిల్లుల జాప్యం ప్రధాన కారణంగా మారింది.


కడప, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎ్‌స జగనమో హనరెడ్డి మానసపుత్రిక అయిన ‘జగనన్న ఇళ్లు’ పథకం మూడు అడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంటి స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయనట్లు జగన సర్కార్‌ ఉచితంగానే స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తున్నామంటూ గొప్పగా చెప్పారు. అయితే ప్రభుత్వం ఇచ్చే సొమ్ము నిర్మాణానికి సరిపోకపోవడం, జగనన్న కాలనీల్లో వసతుల లేమి, బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో జగనన్న ఇళ్ల పథకం ముందుకు సాగడం లేదు. జిల్లాలో 338 జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. మొదటి దశలో జిల్లాకు లక్ష 6 వేల 828 పక్కా గృహాలు కేటాయించారు. 

నత్తనడక

పేదలందరికీ ఇంటి స్థలాలు, పక్కా గృహాలను మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం జిల్లాలో 338 జగనన్న కాలనీలు వేసింది. ఒక్కో కాలనీలో స్థల విస్తీర్ణం బట్టి 100 నుంచి 3,500 ప్లాట్లు కేటాయించారు. ఇంటి వ్యయం రూ.1.80 లక్షలుగా నిర్ణయించారు. పెరిగిన, సిమెంటు, ఇనుము, ఇసుక ధరలు లేబర్‌ చార్జీల కారణంగా ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకోవడానికి సాఽధ్యం కాదని చాలామంది ముందుకు రాలేదు. అయితే ఇల్లు కట్టుకోకపోతే స్థలాన్ని రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో చాలా మంది పునాదులు వేసేందుకు పూనుకున్నారు.

పునాదుల దశలో.. 

జిల్లాకు మంజూరైన 1,06,828 పక్కా గృహాలలో ఇప్పటి వరకు 22,487 మంది ఇంకా గృహ నిర్మాణం మొదలు పెట్టలేదు. 56,518 ఇల్లు పునాదులు వేసేందుకు సిద్ధం చేశారు. 6,451 ఇళ్లు బేస్మెంట్‌ లెవల్‌లో ఉన్నాయి. రూఫ్‌ లెవల్‌లో 1,299 ఇళ్లు ఉండగా, స్లాబ్‌ స్థాయికి 1,651 ఇళ్లు ఉన్నాయి. 170 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తంగా 66,097 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలను దశల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుంది. బేస్‌మట్టం స్థాయిలో రూ.60 వేలు, రూఫ్‌ లెవల్‌లో రూ.60 వేలు, స్లాబ్‌ దశలో రూ.30 వేలు, ఇల్లు పూర్తి అయితే ఫైనల్‌గా రూ.30 వేలు చెల్లిస్తారు. అయితే పునాదులు, బేస్‌మట్టం లెవల్‌కు వచ్చినా కూడా చాలామందికి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతో నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో జగనన్న కాలనీలో నీటి వసతి, ఇసుక, సిమెంటు, కడ్డీలు, ఇతర నిర్మాణ సామగ్రికి భద్రత కరువైంది. దీంతో జగనన్న ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

జిల్లాకు మంజూరైన ఇళ్లు, వాటి పురోగతి వివరాలు 

నియోజకవర్గం     కేటాయింపు పునాది బేస్‌ రూఫ్‌ స్లాబ్‌ పూర్తి 


కడప 26392 17348 1346 82 66 27

కమలాపురం 5233 2224 610 208 194 14

రాయచోటి 9589 6255 1209 139 186 16

మైదుకూరు 8246 4108 587 248 400 95

ప్రొద్దుటూరు 21341 11635 222 122 188 13

పులివెందుల 9130 297 98 24 68 0

జమ్మలమడుగు 8964 3989 741 174 229 1

రాజంపేట 7633 3801 726 112 135 6

కోడూరు 5747 2353 478 139 317 41

బద్వేలు 7332 4373 574 102 62 3


మొత్తం 1,06,808 56,518   6451 1299 1651 178


ఈ చిత్రంలో కనిపిస్తున్నవి బద్వేలు మున్సిపల్‌ పరిధిలో చెన్నపల్లె సమీపంలో వేసిన జగనన్న కాలనీలు. ఇక్కడ మూడు లేఔట్లలో 1,730 ఇళ్లు కేటాయించగా 293 ఇళ్లు మాత్రమే బేస్మట్టం లెవల్‌లో ఉన్నాయి. సరైన వసతులు లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకునే వారు ఇబ్బంది పడుతున్నారు. 



Updated Date - 2022-01-07T05:16:16+05:30 IST