పారిశుధ్య మెరుగునకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-10-05T05:51:31+05:30 IST

పీహెచ్‌సీలలో ఉండే శ్యానిటేషన్‌ కమిటీ నిధులతో గ్రామాల్లో పారిశుధ్య మెరుగునకు చర్యలు చేపట్టాలని డీపీఎంవో డా క్టర్‌ లోకవర్దన్‌ ఆశా వర్కర్లను ఆదే శించారు.

పారిశుధ్య మెరుగునకు చర్యలు చేపట్టాలి
ఆశా వర్కర్లకు కిట్లు అందజేస్తున్న డాక్టర్‌ లోకవర్దన్‌

పీలేరు, అక్టోబరు 4: పీహెచ్‌సీలలో ఉండే శ్యానిటేషన్‌ కమిటీ నిధులతో గ్రామాల్లో పారిశుధ్య మెరుగునకు చర్యలు చేపట్టాలని డీపీఎంవో డా క్టర్‌ లోకవర్దన్‌ ఆశా వర్కర్లను ఆదే శించారు. పీలేరు మండలంలోని రేగ ళ్లు పీహెచ్‌సీని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడుతూ  గ్రామాల్లో పైప్‌లైన్‌ లీకేజీలు అరికట్టి తాగునీరు కలుషితం కాకుండా, విష జ్వరాలు ప్రబలకుండా చూడాలన్నారు. అనంతరం ఆశా దినోత్సవం సంద ర్భంగా పీహెచ్‌సీ పరిధిలోని 26 మంది ఆశావర్కర్లకు హెచ్‌బీవైసీ కిట్లు పం పిణీ చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు కార్తీక్‌, శైలజ, సీహెచ్‌వో జయలక్ష్మి, హెచ్‌ఈ ఉషారాణి, మహమ్మద్‌ రఫీ, సూపర్‌వైజర్లు  పాల్గొన్నారు. 


Read more