‘ఒక్క చాన్స్’తో అథోగతిలో రాష్ట్రం
ABN , First Publish Date - 2022-12-16T22:51:42+05:30 IST
ఒక్కచాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథనాయుడు విమర్శించారు.
చిట్వేలి, డిసెంబరు 16: ఒక్కచాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథనాయుడు విమర్శించారు. శుక్రవారం నేతివారి పల్లెలో మండల టీడీపీ అధ్యక్షుడు కేకే చౌదరి, టీడీపీ నాయకులతో కలిసి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మూడేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అభివృ ద్ధి జరగలేదని విమర్శించారు. ఈ అవినీతి, అరాచక పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వివరిం చారు. నాగయ్యయాదవ్, మహిళా నేత అనితాదీప్తి, బాలకృష్ణయాదవ్, ఆదిలక్షుమ్మ, రమేష్, కట్టలోకేష్, రాజశేఖర్నాయుడు, శ్రీధర్నాయుడు, శ్రీవాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సంబేపల్లె: వైసీపీ అసాంఘీక, అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీడీపీ మండలశాఖ అధ్యక్షులు చిన్నరెడ్డెయ్యయాదవ్, మండల టీడీపీ నాయకులు గోపీనాధరెడ్డి తెలిపా రు. శుక్రవారం నాగిరెడ్డిగారిపల్లెలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్య క్రమం నిర్వహించారు. వట్టంవాండ్లపల్లె, అన్నప్పగారిపల్లె, గోరావాండ్లపల్లె, మొటుకువాండ్లపల్లెల్లో ఇంటింటికి తిరిగి వైసీపీ అరాచక పాలనను ప్రజలకు వివరించారు. ఓటు అనే ఆయుధంతో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు. మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని, మన రాష్ర్టానికి రాజధాని లేకుండా చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహిం చేది లేదన్నారు.బత్తల రవి, బత్తల శేఖరం, గురవయ్య, గంగరాజు, హరియాదవ్, శివయ్య, రవిశంకర్, ఆదెన్న, లక్ష్మినరసయ్య, మల్లికార్జున, సురేష్, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
=================