అతివేగం ప్రమాదకరం: సీఐ

ABN , First Publish Date - 2022-12-15T23:45:54+05:30 IST

అతివేగం ప్రమాదకరమని ఒంటిమిట్ట సీఐ పురుషోత్తంరాజు పేర్కొన్నారు. గురువారం కోదండ రామాలయ వెనుకభాగంలో ఆటోడ్రైవర్లు, వాహనదారులతో సమావేశాన్ని నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆటో డ్రైవర్లకు వివరించారు.

అతివేగం ప్రమాదకరం: సీఐ
ఆటో కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ పురుషోత్తంరాజు

ఒంటిమిట్ట, డిసెంబరు 15: అతివేగం ప్రమాదకరమని ఒంటిమిట్ట సీఐ పురుషోత్తంరాజు పేర్కొన్నారు. గురువారం కోదండ రామాలయ వెనుకభాగంలో ఆటోడ్రైవర్లు, వాహనదారులతో సమావేశాన్ని నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆటో డ్రైవర్లకు వివరించారు. అదేవిఽధంగా ఆటో డ్రైవర్లు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మధుసూదన్‌రావు, కానిస్టేబుల్‌ సుబ్బారెడ్డి, సిబ్బంది సునీల్‌, పోలీసులు, ఆటో కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:45:55+05:30 IST