రెడ్డెమ్మకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-07-04T05:25:04+05:30 IST

గుర్రంకొండ మండలం చెర్ల్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

రెడ్డెమ్మకు ప్రత్యేక పూజలు
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

గుర్రంకొండ, జూలై 3:గుర్రంకొండ మండలం చెర్ల్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయంలో అమ్మ వారు సంతాన లక్ష్మీగా ప్రసిద్ధి చెందా రు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడానికి మహిళా భక్తులు అధికంగా వస్తారు. సంతానంలేని దంపతులు సంతానం కోసం ఆల యానికి రాగా, అమ్మవారి కృపతో సంతా నం పొందిన మహిళలు మొక్కులు తీర్చు కోవడానికి అధికంగా వచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి. కార్యక్రమంలో ఈవో రవీంద్ర రాజు, చైర్మన్‌ నరసింహారెడ్డిలు పాల్గొన్నారు.

Read more