అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-07-19T05:07:25+05:30 IST

స్పందన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి గడువులోపు పరిష్క రించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులను ఆదే శించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌, డీఆర్‌వో సత్య నారాయణలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్‌
అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), జూలై 18: స్పందన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి గడువులోపు పరిష్క రించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధికారులను ఆదే శించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌, డీఆర్‌వో సత్య నారాయణలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాటాడుతూ అధికారులు స్పందన అర్జీలను పరిశీలించిన తర్వాత అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాలన్నారు. ఇలా చేయడం వల్ల అర్జీలు రీఓపెన్‌ చేసే అవకాశం ఉండదన్నారు. అర్జీలను గడువులోపు పరిష్కరించి బియాండ్‌ ఎస్‌ఎస్‌ ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అధికారులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. 

ప్రొటోకాల్‌ తప్పనిసరిగా పాటించాలి

జిల్లాలోని వివిధ శాఖల అధికారులు తప్పకుండా ప్రొటో కాల్‌ పాటించాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో జరు గుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రొటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రిక పంపడంతో పాటు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి కార్యక్రమాల వివరాలు తెలియజేయాలన్నారు. 

స్పందన కార్యక్రమంలో వచ్చిన కొన్ని వినతులు

-వీరబల్లి మండలం బేపార్టీపాలెంకు చెందిన ఆర్‌.శోభిత సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేయాలని వినతిలో కోరింది. 

-కలకడ మండలం, దావుపల్లికు చెందిన కె.వెంకట సుబ్బయ్య వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

-సుండుపల్లె మండలం సానిపేటకు చెందిన కె.నీరజ ఇంటి స్థలం మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. 

Read more