పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2022-12-16T00:04:44+05:30 IST
వాల్మీకిపు రం పట్టణంలోని జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నెలకొన్న సమ స్యలు పరిష్కరించాలని గురువారం ఎంపీడీవో షబ్బీర్అహ్మద్కు హెచఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
వాల్మీకిపురం, డిసెంబరు 15: వాల్మీకిపు రం పట్టణంలోని జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నెలకొన్న సమ స్యలు పరిష్కరించాలని గురువారం ఎంపీడీవో షబ్బీర్అహ్మద్కు హెచఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఆమేర కు ఎంపీడీఓకు వారొక వినతిపత్రం అంద జేశారు. పాఠశాలలో 132మంది విద్యా ర్థులు చదువుకుంటున్నారని వర్షాలు కురిసే సమయాన పాఠశాల ప్రాంగణంలో నీరు చేరి చెరువును తలపిస్తోందన్నారు. పాఠశాలలో బాలికలు ఎక్కువగా ఉండడం వల్ల మరుగుదొడ్లకు వెళ్లాలన్నా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన ఖాదర్వల్లి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.