ఏకీకృత సర్వీసు కోసం కృషిచేయాలి
ABN , First Publish Date - 2022-03-06T04:50:17+05:30 IST
ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నియమాల అమలుకు ప్రభుత్వం కృషి చేసి పదోన్నతుల శాపాన్ని తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి డిమాండ్ చేశారు.
రైల్వేకోడూరు రూరల్, మార్చి 5: ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నియమాల అమలుకు ప్రభుత్వం కృషి చేసి పదోన్నతుల శాపాన్ని తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఓబులవారిపల్లె మండలంలోని పాఠశాలల ను సందర్శించి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీఓ 223ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి పాఠశాల సహాయకులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఖాజా మొహిద్దీన్, రాజశేఖర్, శివశంకర్ రాజు, రామసుబ్బారెడ్డి, సంపత్, ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, గంగరాజు గంగాధర్, సి.చంద్రశేఖర్, కుమార్ పాల్గొన్నారు.