డ్రోన్‌తో సమయం, ద్రావణం ఆదా
ABN , First Publish Date - 2022-12-31T23:39:34+05:30 IST
రైతులు డ్రోన్ పరికరంతో పంట పొలాల్లో రసాయన మందును పిచికారీ చేసుకుంటే సమయంతోపాటు రసాయన మందు కూడా ఆదా అవుతుందని ఏవో నాగార్చన, ఏరువాక కేంద్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ మురళీకృష్ణ, శాస్త్రవేత్త శిల్పకళ పేర్కొన్నారు.
ఖాజీపేట, డిసెంబరు 31: రైతులు డ్రోన్ పరికరంతో పంట పొలాల్లో రసాయన మందును పిచికారీ చేసుకుంటే సమయంతోపాటు రసాయన మందు కూడా ఆదా అవుతుందని ఏవో నాగార్చన, ఏరువాక కేంద్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ మురళీకృష్ణ, శాస్త్రవేత్త శిల్పకళ పేర్కొన్నారు. తిప్పాయపల్లె గ్రామ పొలాల్లో శనివారం రిలయన్స్, ఎన్జీరంగ వ్యవసాయ విద్యాలయ వారి సౌజన్యంతో డ్రోన్ పరికరంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ వారు రైతులకు 40 నుంచి 50 శాతం సబ్సిడీతో అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.