హక్కు లేకుండానే భూమి విక్రయాలు

ABN , First Publish Date - 2022-10-08T04:26:30+05:30 IST

ఎలాంటి హక్కులూ లేకుండానే ఓ వ్యక్తి కుంట రూ. 4 వేలకు విక్రయిస్తున్నట్లు తహసీల్దారుకు ఫిర్యాదు అందింది. తాకాటంవారిపల్లికి చెందిన ఓబులేసు అనే వ్యక్తి సర్వే నెంబరు 245-1లో రూ.4వేలకే కుంట భూమి ఇస్తానని నమ్మబలికి పలువురికి అగ్రిమెంట్లు రాసిచ్చాడు.

హక్కు లేకుండానే భూమి విక్రయాలు

బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి

బి.కొత్తకోట, అక్టోబరు 7: ఎలాంటి హక్కులూ లేకుండానే ఓ వ్యక్తి కుంట రూ. 4 వేలకు విక్రయిస్తున్నట్లు తహసీల్దారుకు ఫిర్యాదు అందింది. తాకాటంవారిపల్లికి చెందిన ఓబులేసు అనే వ్యక్తి సర్వే నెంబరు 245-1లో రూ.4వేలకే కుంట భూమి ఇస్తానని నమ్మబలికి పలువురికి అగ్రిమెంట్లు రాసిచ్చాడు. ఈ సర్వే నెంబర్‌ పై తనకు హక్కు లేక పోయినా నగదు తీసుకున్నాడు. బి.కొత్తకోటకు చెందిన వందలాది మంది నుంచి ఇలా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధితులు శుక్రవారం తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ధనంజయులు మాట్లా డుతూ సర్వే నెంబర్‌ 245-1లో ఓబులేసుకు సెంటు భూమి లేదని, ఒక తోక పాస్‌ బుక్కు పెట్టుకుని ప్రజలకు మోసం చేస్తున్నాడన్నారు. ఈ వ్యక్తి దగ్గర ఎవరూ భూమి కొని మోసపోవద్దని సూచించారు. బాధితుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు వస్తే  తగిన చర్యలు తీసుకుంటానని ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. 

Updated Date - 2022-10-08T04:26:30+05:30 IST